HomeEntertainment'కొరియన్ కనకరాజు'లో ఎన్టీఆర్‌కు అవమానం? వైరల్ డైలాగ్‌పై ఫ్యాన్స్ ఫైర్!

‘కొరియన్ కనకరాజు’లో ఎన్టీఆర్‌కు అవమానం? వైరల్ డైలాగ్‌పై ఫ్యాన్స్ ఫైర్!

Published on

spot_img

కొరియన్ కనకరాజు: వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్‌ను అవమానించేలా ఓ డైలాగ్ ఉందంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న సీనియర్ ఎన్టీఆర్ సినిమా డైలాగ్‌ను ఉద్దేశపూర్వకంగానే ఈ చిత్రంలో ఉపయోగించారని వారు ఆరోపిస్తున్నారు. ‘కొరియన్ కనకరాజు’లో సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘యుగపురుషుడు’లోని ప్రసిద్ధ “మీ షాట్ చాలా అమెచ్యూరీష్గా ఉంది” డైలాగ్‌ను ఫైట్ సీన్‌లో ఉపయోగించారు. ప్రేక్షకులు దీనిని హాస్యంగా స్వీకరిస్తుండగా, నందమూరి అభిమానులు మాత్రం మహానటుడి ఐకానిక్ సీన్‌ను చౌకగా చూపించారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు

సీన్ తొలగించాలని డిమాండ్:

ఈ వివాదాస్పద సన్నివేశాన్ని వెంటనే తొలగించాలని NTR అభిమానులు మేకర్స్‌ను డిమాండ్ చేస్తున్నారు. తమ అభిమాన నటుడి గౌరవానికి భంగం కలిగించేలా ఎలాంటి డైలాగ్‌లు ఉండకూడదని సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.

మరోవైపు భిన్నాభిప్రాయాలు:

అయితే ఈ అంశంపై మరో వర్గం భిన్నంగా స్పందిస్తోంది. గతంలో అనేక సినిమాల్లో సీనియర్ హీరోల డైలాగ్‌లు, హావభావాలు, మేనరిజమ్‌లను అనుకరించిన సందర్భాలు ఉన్నాయని, ఇందులో తప్పేమీ లేదని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదంపై చిత్రబృందం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

హైదరాబాద్‌లో బిగ్ స్క్రీన్‌ మ్యాజిక్‌.. డిసెంబర్‌లో కొత్త ఐమ్యాక్స్‌!

హైదరాబాద్‌ సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఏఎంబీ క్లాసిక్ విక్టరీ ప్రాంగణంలో కొత్త ఐమ్యాక్స్‌ స్క్రీన్‌ అందుబాటులోకి రానుంది. డిసెంబర్‌లో ప్రారంభం కానున్న ఈ స్క్రీన్‌తో ప్రేక్షకులకు మరింత అద్భుతమైన బిగ్‌ స్క్రీన్‌ అనుభూతి లభించనుంది.

ప్రధాని మోదీ బర్త్‌డే..1,000 మంది మహిళల కోసం మెగా పవర్‌స్టార్‌ భారీ నిర్ణయం!

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’లో భాగంగా 1,000 మంది మహిళలకు మద్దతు అందించే కార్యక్రమాన్ని ప్రకటించారు.

స్నేహకు బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న చిరంజీవి.. లైఫ్ లో మర్చిపోలేనిది..!?

హీరోయిన్ స్నేహకు మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ సర్‌ప్రైజ్ ఉండనుందని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.