వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా సీడీఎఫ్, మున్సిపల్ నిధులతో రూ.4.99 లక్షల వ్యయంతో నిర్మితమవుతున్న కట్టమైసమ్మ అమ్మవారి దేవాలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు, దీపాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ.. ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు అనుగుణంగా దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు.

కట్టమైసమ్మ ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు, కరెంటు స్తంభాల వల్ల భక్తులకు రాత్రి వేళల్లో కూడా సౌకర్యవంతంగా దర్శనం చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ వర్ధన్నపేటను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మని శేఖర్ రావు, మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్ నేతావత్ శిభారాణి-రాజేందర్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


