భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక పురాతన ఆలయ ధ్వంసంపై ట్విట్టర్ (X) వేదికగా స్పందింఛారు.
ఖానాపూర్ మండలం, అశోక్ నగర్ సమీపంలో సుమారు 800 ఏళ్ల క్రితం కాకతీయులు నిర్మించిన పురాతన శివాలయం ఉంది. చారిత్రక సంపద అయిన ఈ శివాలయాన్ని ధ్వంసం చేయడం అత్యంత దారుణమని, వెంటనే ఆ విధ్వంసాన్ని ఆపి, ఆలయాన్ని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ చరిత్ర, సంస్కృతి మరియు అస్తిత్వం మీద కనీస అవగాహన లేని వారు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.


