HomePoliticsఅసెంబ్లీలో రేవంత్ పలకరింపు పై కేటీఆర్ స్పందన

అసెంబ్లీలో రేవంత్ పలకరింపు పై కేటీఆర్ స్పందన

Published on

spot_img

అసెంబ్లీలో రేవంత్ పలకరింపుపై కేటీఆర్ స్పందన – కేసీఆర్‌ పట్ల గౌరవాన్ని గుర్తుచేసిన వ్యాఖ్యలు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పలకరించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అసెంబ్లీలో కేసీఆర్‌ను కలిసేంత సంస్కారం ఉంటే చాలని, అదే సంస్కారం బయట మాటల్లో కూడా చూపిస్తే మరింత బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

కేటీఆర్ మాట్లాడుతూ, “రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నా, పరస్పర గౌరవం ఉండటం మంచిది. తెలంగాణను తీసుకొచ్చిన నాయకుడిగా కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉంటారు,” అని తెలిపారు.

రంధ్రాన్వేషణ మానుకోవాలని రేవంత్‌కు కేటీఆర్ సూచన
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన పనుల్లో రంధ్రాన్వేషణ మానుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ హితవు పలికారు. “కేసీఆర్‌కు పేరు వస్తుందనే కారణంగా ప్రభుత్వం పనులను ఆపడం రాష్ట్రానికే నష్టం,” అని వ్యాఖ్యానించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేసీఆర్ చిత్తశుద్ధిని గుర్తుచేస్తూ, “గోదావరి నీటి హక్కుల కోసం అదనపు టీఎంసీలు తీసుకొచ్చారు,” అని కేటీఆర్ చెప్పారు.

రేవంత్ రెడ్డి అవినీతిని అడ్డుకుంటున్నందుంచే తనపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. “నన్ను తిడితే సరే కానీ, కేసీఆర్‌ను తిట్టితే మాత్రం ఊరుకోలేము,” అని గట్టి హెచ్చరిక జారీ చేశారు.

పార్టీని వీడి వెళ్ళిన వారిని తిరిగి తీసుకోమన్న కేటీఆర్
బీఆర్ఎస్ నుండి తప్పుకుని ఇతర పార్టీలలో చేరిపోయిన నేతలను తిరిగి ఆహ్వానించాలనే ఉద్దేశం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.

“బీజేపీలోకి వెళ్లిన నేతల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు సర్పంచ్ స్థానాలను గెలిపించారు. ఇది మా కేడర్ బలం,” అన్నారు.

సర్పంచ్ ఎన్నికల్లో మారిన క్షేత్ర స్థాయిలో వాతావరణం
సర్పంచ్ ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు మారాయని కేటీఆర్ పేర్కొన్నారు.

“కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతకు భయపడి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టడంలేదు. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ నిధుల కోసం తప్పనిసరిగా మున్సిపల్ ఎన్నికలు చేపట్టే పరిస్థితి వచ్చింది,” అని విమర్శించారు.

Latest articles

పిల్లలకు ఫోన్ అలవాటు మాన్పించాలా? తల్లిదండ్రులు ఇలా చేయండి!

పిల్లలకు ఫోన్ అలవాటు ఎక్కువైందా? స్క్రీన్ టైమ్‌ను క్రమంగా తగ్గించడంతో పాటు ప్రత్యామ్నాయంగా ఆటలు, పుస్తకాలు, కుటుంబంతో గడిపే సమయాన్ని పెంచేందుకు తల్లిదండ్రులు పాటించాల్సిన సింపుల్ టిప్స్ ఇవే.

బ్రేక్‌ఫాస్ట్‌ లో ఈ ఫుడ్స్ తింటే కడుపు నిండుగా.. ఆరోగ్యం పదిలం!

ఉదయం అల్పాహారం రోజంతా శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండే సమతుల్యమైన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఎక్కువసేపు ఎనర్జీగా ఉండొచ్చు.

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.
spot_img

Related Articles

కాంగ్రెస్ భూ స్కామ్‌లు, 22A దుర్వినియోగంపై BRS ధ్వజం

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ భూ అక్రమాలు మరియు 22A నిబంధనల దుర్వినియోగంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

కాంగ్రెస్, BRSలపై ఫైర్ అయిన బీజేపీ నేత రామచందర్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్, BRS పార్టీలు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి, వీధి నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, వారి వైఖరిని చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.

కొండా సురేఖను బీఆర్‌ఎస్‌లోకి రానివ్వం: జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖను బీఆర్‌ఎస్ పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వబోమని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.