కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమై, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రతిపక్ష నేతలపై అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిల అరెస్టును ఖండిస్తూ ఆయన నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
హామీలు నెరవేర్చండి – స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతాం..
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలైతే తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలమంతా వాలంటరీగా అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.
మహిళా ప్రజాప్రతినిధులకు రక్షణ ఏది?:
తెలిపిన మాజీ మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆయన మండిపడ్డారు. వారి చీరలు లాగి అవమానించిన వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
కోర్టులను లెక్కచేయని నకిలీ కేసులు:
ఉత్తర్వులను కూడా లెక్క చేయకుండా ఫేక్ కేసులతో ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను అరెస్టు చేశారని విమర్శించారు.
ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న ‘డైవర్షన్ పాలిటిక్స్’ను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


