HomeLatest Newsగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా కేటీఆర్ నమోదు.. అర్హులంతా నమోదు చేసుకోవాలని ‘ఎక్స్’ వేదికగా పిలుపు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా కేటీఆర్ నమోదు.. అర్హులంతా నమోదు చేసుకోవాలని ‘ఎక్స్’ వేదికగా పిలుపు

Published on

spot_img

రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటరుగా నమోదు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్‌ను పూర్తి చేసి దరఖాస్తు సమర్పించారు. ఈ విషయాన్ని కేటీఆర్ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా వెల్లడించారు.

​ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్, మరియు నల్గొండ జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్లు అందరూ తప్పనిసరిగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారు సైతం ఈసారి మళ్లీ కొత్తగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ఆయన గుర్తుచేశారు.

ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు ఈ ఓటరు నమోదు ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అర్హులైన పట్టభద్రులందరినీ నవంబర్ 6 లోపు ఓటర్లుగా నమోదు చేయించేలా ప్రత్యేక చొరవ చూపాలని పార్టీ శ్రేణులను ఆయన కోరారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.