మనస్థాపంతో ఆత్మహత్యయత్నం చేసిన విద్యార్థిని..
చికిత్స పొందుతూ మృతి.
ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీవిద్య
కేయూ లో ఐదేళ్ల ఇంటిగ్రెటెడ్ కెమిస్ట్రీ రెండో సంవత్సరం చదువుతుంది.
పద్మాక్షి బి బ్లాక్ లో ఉంటున్న శ్రీవిద్య
అదే హాస్టల్ లో ఉంటున్న సీనియర్లకు శ్రీవిద్య కు ఓ విషయంలో వివాదం చోటుచేసుకుంది.
ఈ క్రమంలో శ్రీవిద్య పై సీనియర్లు దాడి చేయటమే కాకుండా
శ్రీవిద్య పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సీనియర్లు
హాస్టల్ కు వచ్చి విచారణ చేసి విద్యార్థుల మధ్య సయోధ్య కుదిర్చిన పోలీసులు.
ఈ ఘటన అనంతరం శ్రీవిద్య ను తల్లితండ్రులు ఇంటికి తీసుకెళ్లారు.
అనంతరం ఏపీ లోని తమ అమ్మమ్మ ఇంటికి (గంపలగూడెం )వెళ్లిన శ్రీవిద్య.
ఈ నెల 7, 8 తేదీలలో రెండు సార్లు ఎలుకల మందు తిని ఆత్మహత్య కు యత్నించింది.
సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలింపు.
పరిస్థితి విషమించడంతో నిమ్స్ కు తరలింపు.
చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందిన శ్రీవిద్య.
ఈ ఘటన పై మధిర పోలీస్ స్టేషన్ లో తల్లితండ్రుల ఫిర్యాదు.


