హనుమకొండ: భద్రకాళి అమ్మవారి మాడవీధుల నిర్మాణం కోసం తమ భూములను స్వచ్ఛందంగా అందజేసిన నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (KUDA) చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు.
తమ భూములను త్యాగం చేసిన 17 నిర్వాసిత కుటుంబాలకు భద్రకాళి బండ్ ప్రాజెక్టులో ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించి, ఆర్థిక భరోసానిచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ఉద్యోగాల్లో చేరి విజయవంతంగా నెల రోజులు పూర్తి చేసుకున్న సిబ్బందికి చైర్మన్ వెంకట్రామిరెడ్డి చేతుల మీదుగా జీతాల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చారిత్రక భద్రకాళి దేవాలయ అభివృద్ధిలో భూములు కోల్పోయిన వారి త్యాగం అమూల్యమైనదని కొనియాడారు. వారికి కేవలం ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా, సకాలంలో వేతనాలు అందేలా చూస్తూ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుడా అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Read More Articles
భద్రకాళి చెరువులో పూడికతీత పనులను వేగవంతం చేయాలి: హన్మకొండ కలెక్టర్
వరంగల్‌కు ప్రధాని మోదీ: మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన? భద్రకాళి ఆలయంలో ఎస్పీజీ తనిఖీలు
హనుమకొండ భద్రఖాళీ ఆలయంలో లక్ష పుష్పార్చన
Read Warangal News and Latest Politics News and Real Estate


