తమకు జరిగిన అన్యాయంపై ఎక్కడా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఒకే కుటుంబానికి చెందిన బాధితులు హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసనకు దిగారు. లక్ష్మీనారాయణ అనాజ్ కిరాణం వ్యాపారి చేతిలో తాము దారుణంగా మోసపోయామని వారు ఆరోపిస్తున్నారు.
మారిగేజ్ లోన్ ఇప్పిస్తామని నమ్మించి, మోసపూరితంగా తమ ఇల్లు, ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితులు వాపోతున్నారు. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని, అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని కన్నీరుమున్నీరయ్యారు. తమకు బతకడం ఇష్టం లేదని, సామూహికంగా ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విన్నవించుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.


