HomeWarangal Newsహనుమకొండలో భూ వివాదం.. రిటైర్డ్ ఎంఆర్ఓ వేధింపులపై బాధిత కుటుంబం ఆవేదన

హనుమకొండలో భూ వివాదం.. రిటైర్డ్ ఎంఆర్ఓ వేధింపులపై బాధిత కుటుంబం ఆవేదన

Published on

spot_img

హనుమకొండలో భూ వివాదం.. రిటైర్డ్ ఎంఆర్ఓ వేధింపులపై బాధిత కుటుంబం ఆవేదన :

హనుమకొండ : తమ సొంత భూమిపై ఓ రిటైర్ ఎంఆర్ఓ కన్నేసారని.. అనవసర వివాదాలు సృష్టిస్తూ తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఓ బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. గత నాలుగు దశాబ్దాలుగా అదే స్థలంలో నివాసం ఉంటూ పెంకుటిల్లు నిర్మించుకొని జీవనం కొనసాగిస్తున్నామని వారు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఇటీవల ఆ స్థలాన్ని మరో వ్యక్తికి విక్రయించామని.. అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు లింక్ డాక్యుమెంట్లు, బిల్డింగ్ అనుమతులు సహా అన్ని చట్టబద్ధ పత్రాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు.

అయినప్పటికీ రిటైర్డ్ ఎంఆర్ఓ వ్యక్తిగత కక్షతో తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. తమకు ఎలాంటి సంబంధం లేని డిపి నంబర్ ని సాకుగా చూపిస్తూ అనవసరంగా వివాదం సృష్టిస్తున్నారని.. దీనికి కొందరు అధికారులు సహకరించారని బాధితులు ఆరోపించారు.

తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ దస్తావేజు రద్దు చేయడం తీవ్ర అన్యాయం అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై కాజీపేట సెక్షన్ 2 మునిసిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. ఫిర్యాదును స్వీకరించిన అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. తమకి జరుగుతున్న అన్యాయంపై జిల్లా కలెక్టర్, మునిసిపల్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ జరిపించాలని బాధ్యత కుటుంబం విజ్ఞప్తి చేసింది. నిజాలు వెలికి తీసి తమకు న్యాయం చేయాలని ఉన్నత అధికారులను కోరింది.

Latest articles

బ్రేక్‌ఫాస్ట్‌ లో ఈ ఫుడ్స్ తింటే కడుపు నిండుగా.. ఆరోగ్యం పదిలం!

ఉదయం అల్పాహారం రోజంతా శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండే సమతుల్యమైన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఎక్కువసేపు ఎనర్జీగా ఉండొచ్చు.

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి
spot_img

Related Articles

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...