సాంకేతికత తోడైతే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తూ.. హనుమకొండ జిల్లాలో దివ్యాంగులకు చేయూతనిచ్చే కార్యక్రమం జరిగింది.
జిల్లాలోని ఐదుగురు దివ్యాంగులకు ల్యాప్‌టాప్‌లను అందజేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ పంపిణీ నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానం దివ్యాంగుల సాధికారతకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ల్యాప్‌టాప్‌లు వారి భవిష్యత్తుకు కొత్త మార్గాలను చూపుతాయని ఆశిస్తున్నామని అన్నారు నాయిని రాజేందర్ రెడ్డి.


