ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఈ వాతావరణం వల్ల పలుచోట్ల ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది.
మహబూబాబాద్ జిల్లా సూదనపల్లి కొనుగోలు కేంద్రంలో ఒక విషాదం చోటుచేసుకుంది. ధాన్యానికి తార్పాలిన్లు కప్పుతున్న సమయంలో నీలం వెంకన్న అనే వ్యక్తిపై పిడుగు పడింది. ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. అకాల వర్షం వల్ల కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం, మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గాలివాన ధాటికి పలుచోట్ల చెట్లు, కొమ్మలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ ఘటనతో సూదనపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


