హనుమకొండ:
హనుమకొండలోని భీమారం బస్టాప్ వద్ద శనివారం ఉదయం లారీ బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వచ్చిన లారీ ముందుగా ఒక ఆటోను ఢీకొట్టి, అనంతరం విధుల్లో ఉన్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులపైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికురాలు కన్నం రాణి (45) కాలు పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, మరో కార్మికురాలు మంద విక్టోరియాకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఆటో డ్రైవర్ జనార్దన్ చేయి విరిగినట్లు సమాచారం.
ప్రమాదాన్ని గమనించిన 108 అంబులెన్స్ సిబ్బంది సురేశ్, కోటిలింగం తక్షణమే స్పందించి గాయపడిన వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు అక్కడ చికిత్స పొందుతున్నారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. 🚑


