హైదరాబాద్-హన్మకొండ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఒక భారీ ప్రమాదం తప్పింది. వరంగల్ నుండి హైదరాబాద్ వైపు గాజుల లోడ్‌తో వెళ్తున్న ఒక లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
లారీలో మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ సంజయ్, వెంటనే అప్రమత్తమై వాహనాన్ని నిలిపివేశారు. డ్రైవర్ ‘డయల్ 100’ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఫైర్ ఇంజిన్‌ను ఘటనా స్థలానికి రప్పించి మంటలను అదుపు చేశారు. డ్రైవర్ అప్రమత్తత వల్ల ప్రాణనష్టం తప్పింది.


