హన్మకొండ జిల్లాలో ప్రేమ వ్యవహారం విషాదంతానికి దారి తీసే పరిస్థితి నెలకొంది. ప్రేమించిన యువతి తనను దూరం పెడుతుంది అనే మనస్థాపనతో యువకుడు ఫ్లోర్ క్లీనర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనకు సంబంధించిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.

సుబేదారి ప్రాంతానికి చెందిన సల్మాన్ అనే యువకుడు ఓ యువతని ఎంతోకాలంగా ప్రేమిస్తున్నట్లు సమాచారం.
అయితే ఇటీవల యువతి అతనిని దూరం పెడుతూ రావడం.. మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపకపోవడంతో సల్మాన్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
ప్రేమలో ఎదురైన నిరాశతో మానసికంగా కృంగిపోయినా అతడు జీవితం పట్ల విసుగుచెంది.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలో ఇంట్లో ఉన్న ఫ్లోర్ క్లీనర్ తాగి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే తాను ఈ ఘాతుకానికి పాల్పడుతున్న సమయంలోనే తన మొబైల్ ఫోన్లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేయడం మరింత విషాదకరంగా మారింది.
వీడియోలో తన బాధను వ్యక్తం చేస్తూ ప్రేమించిన యువతి తనను వదిలేసిందని.. ఇక బ్రతకాలని అనిపించడం లేదు అని.. భావోద్వేగంతో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ గా మారింది.
సమాచారం అందుకున్న సుబేదారి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.


