సోషల్ మీడియాలో ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ గడువు మారిందని జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పుడు సమాచారం అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలు ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మవద్దని సూచించింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న నియమాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని కేంద్రం తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో LPG సిలిండర్ రీఫిల్ బుకింగ్‌కు 25 రోజుల గడువు కొనసాగుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఈ గడువు 45 రోజులుగా యథావిధిగా ఉంది.
అదేవిధంగా దేశవ్యాప్తంగా సరిపడా LPG నిల్వలు ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని కేంద్రం భరోసా ఇచ్చింది. ప్రజలు అనవసర ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.


