దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ వినియోగదారులకు మే 1 నుంచి కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. సరఫరా వ్యవస్థలో పారదర్శకత పెంచడం, దుర్వినియోగాన్ని అరికట్టడం లక్ష్యంగా ఈ కొత్త రూల్స్‌ను అమలు చేస్తున్నారు.
బుకింగ్ గ్యాప్ పెంపు
నగర ప్రాంతాల్లో ఒక సిలిండర్ బుకింగ్ తర్వాత మరో బుకింగ్ చేసేందుకు కనీసం 25 రోజుల గ్యాప్ తప్పనిసరి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ గడువు 45 రోజులుగా నిర్ణయించారు.
OTP ఆధారిత డెలివరీ తప్పనిసరి
గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో OTP ధృవీకరణను పూర్తిగా అమలు చేయనున్నారు. సబ్సిడీ సిలిండర్ల దుర్వినియోగం, మళ్లింపును అరికట్టేందుకు ఇది కీలకంగా మారనుంది.
డిజిటల్ బుకింగ్‌కు ప్రాధాన్యం
ఇప్పటికే 98% వరకు బుకింగ్‌లు ఆన్‌లైన్‌లో జరుగుతుండగా, మే నుంచి డెలివరీ వ్యవస్థను మరింత డిజిటలైజ్ చేసి, సేవలను వేగవంతం చేయనున్నారు.
ఈ మార్పులతో వినియోగదారులకు మరింత పారదర్శకమైన, సురక్షితమైన సేవలు అందనున్నాయని అధికారులు తెలిపారు.


