కేఎఫ్‌సీ (KFC) చికెన్‌కు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. పెద్ద నగరాలకే పరిమితం కాకుండా చిన్న పట్టణాల్లోనూ కేఎఫ్‌సీ రెస్టారెంట్లు విస్తరిస్తున్నాయంటే దీనికి ఉన్న ఆదరణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా కేఎఫ్‌సీకి సంబంధించిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
డీప్ ఫ్రైడ్ చికెన్‌లో పురుగు :
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా వెస్ట్‌లో ఉన్న గౌర్ సిటీ మాల్ కేఎఫ్‌సీ అవుట్‌లెట్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఓ కస్టమర్ ఆర్డర్ చేసిన డీప్ ఫ్రైడ్ చికెన్‌లో పురుగు కనిపించినట్లు ఆరోపించాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో పోస్ట్ :
తన పోస్టులో కస్టమర్ కేఎఫ్‌సీని ట్యాగ్ చేస్తూ.. తాను ఆర్డర్ చేసిన డీప్ ఫ్రైడ్ చికెన్‌లో పురుగు కనిపించిందని పేర్కొన్నాడు. ఈ ఘటనపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఫుడ్ చైన్ అవుట్‌లెట్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
KFC స్పందన :
కస్టమర్ చేసిన ఫిర్యాదుకు కేఎఫ్‌సీ స్పందించింది. జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూ, ఆర్డర్‌కు సంబంధించిన వివరాలను అందిస్తే తమ సిబ్బంది సమస్యను పరిశీలించి పరిష్కరిస్తారని తెలిపింది. అయితే ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ఇలాంటి ఘటనలతో బయట ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు.


