HomeLatest Newsమహబూబాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ: రిటైర్డ్ ఉపాధ్యాయుడి నుంచి రూ. 82 లక్షలు స్వాహా

మహబూబాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ: రిటైర్డ్ ఉపాధ్యాయుడి నుంచి రూ. 82 లక్షలు స్వాహా

Published on

spot_img

మహబూబాబాద్ జిల్లాలో సైబర్ కేటుగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో భయభ్రాంతులకు గురిచేసి, ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడి నుంచి ఏకంగా రూ. 82,40,000 కాజేశారు.

మహబూబాబాద్‌లోని కంకరబోడ్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడికి గుర్తుతెలియని వ్యక్తులు బాధితుడికి వాట్సాప్ వీడియో కాల్ చేశారు. తాము సీబీఐ (CBI) అధికారులమని నమ్మబలికారు.

​బెదిరింపులు: బాధితుడిపై వేధింపుల కేసులు ఉన్నాయని, అరెస్ట్ వారంట్ జారీ అయిందని భయపెట్టారు. కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు.

​ నిందితుల మాటలు నమ్మిన బాధితుడు, వారు చెప్పిన వివిధ ఖాతాలకు విడతల వారీగా మొత్తం రూ. 82.40 లక్షలను బదిలీ చేశారు. ​తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.

​ గమనిక: సీబీఐ, ఈడీ లేదా పోలీస్ అధికారులు ఎప్పుడూ వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా అరెస్ట్ చేస్తామని బెదిరించరు. ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయండి.

Latest articles

అభిమానం అంటే ఇదే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన పనికి ప్రశంసలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) సామాజిక బాధ్యతలో భాగంగా కీలక కార్యక్రమం చేపట్టింది. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై దేశవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది బాలికలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

నిద్రలో పదేపదే మేల్కొంటున్నారా? మీ శరీరం చెప్తుందే ఇదే..!

రాత్రిపూట నిద్రలో పదేపదే మెలకువ రావడానికి ఒత్తిడి, ఆందోళన, కెఫిన్, గది వాతావరణం వంటి కారణాలు ఉండొచ్చు. అయితే గురకతో పాటు శ్వాస ఆగడం, పగటిపూట అధిక నిద్రమత్తు ఉంటే స్లీప్ అప్నియా సంకేతాలు కావచ్చు.

బొప్పాయిని రోజూ తింటే ఇన్ని లాభాలా? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

రోజూ పరిమిత మోతాదులో బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఫైబర్‌, యాంటీఆక్సిడెంట్లు అందుతాయి. బొప్పాయిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

మెహందీ కళాకారుల ఉద్యోగాలకు ఎసరు? వైరల్ AI వీడియోతో కొత్త భయం!

మెహందీ ఆర్టిస్టుల పనిని సులభతరం చేసేలా కనిపిస్తున్న ఓ మెషీన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా షేర్ చేసిన ఈ AI-generated వీడియోపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.
spot_img

Related Articles

AI 80’s ఫోటో ట్రెండ్‌పై నిపుణుల హెచ్చరిక.. ఫోటోలు అప్‌లోడ్ చేసే ముందు జాగ్రత్త!

AI టూల్స్‌తో 1980ల నాటి ఫోటోల తరహాలో చిత్రాలను మార్చుకునే ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వ్యక్తిగత ఫోటోలను AI ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేసే ముందు ప్రైవసీ, డేటా భద్రతపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మెహందీ కళాకారుల ఉద్యోగాలకు ఎసరు? వైరల్ AI వీడియోతో కొత్త భయం!

మెహందీ ఆర్టిస్టుల పనిని సులభతరం చేసేలా కనిపిస్తున్న ఓ మెషీన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా షేర్ చేసిన ఈ AI-generated వీడియోపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.

తెలంగాణపై అల్పపీడన ప్రభావం: ఈ నెల 14 వరకు మోస్తరు వర్షాలు

తెలంగాణ రాష్ట్రంపై అల్పపీడనం ప్రభావం చూపుతోంది. దీని ఫలితంగా నేటి నుంచి ఈ నెల 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.