తెలంగాణలో తాజాగా జరిగిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీల నేపథ్యంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన స్నేహ శబరీష్‌ను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. అదే జిల్లాకు ఆమె భర్తను ఎస్పీగా నియమించడం విశేషంగా మారింది.
సాధారణంగా ఒకే జిల్లాలో భార్యాభర్తలు కలెక్టర్, ఎస్పీలుగా బాధ్యతలు నిర్వర్తించడం చాలా అరుదు. ఈ నేపథ్యంలో ఈ నియామకం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఇంతకుముందు మహబూబాబాద్ కలెక్టర్‌గా పనిచేసిన అద్వైత్ కుమార్ సింగ్ బదిలీ కావడంతో, ఆయన స్థానంలో స్నేహ శబరీష్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక జిల్లాలో పరిపాలన, పోలీసు వ్యవస్థను భార్యాభర్తలే నడిపించనున్న తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


