భారత సైన్యానికి చెందిన మహిళా అధికారి, మేజర్ అభీలాష బరాక్ ప్రతిష్టాత్మక ‘2025 UN మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్నారు.
ప్రస్తుతం ఆమె లెబనాన్‌లో ఐక్యరాజ్యసమితి (UN) శాంతి పరిరక్షక దళంలో విధులు నిర్వర్తిస్తున్నారు.
మహిళలు మరియు బాలికల సాధికారత, వారి సంక్షేమం కోసం ఆమె చేసిన విశేష కృషికి గాను ఈ అంతర్జాతీయ పురస్కారం దక్కింది.
ఈ అవార్డును అందుకున్న మూడవ భారతీయురాలిగా అభీలాష బరాక్ నిలిచారు. ఆమె కంటే ముందు మేజర్ సుమన్ గవాని (2019), మేజర్ రాధికా సేన్ (2024) ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
మేజర్ అభీలాష బరాక్ భారత సైన్యంలో తొలి మహిళా కాంబాట్ హెలికాప్టర్ పైలట్ అనే ఘనతను కూడా కలిగి ఉన్నారు.


