ప్రజల రోజువారీ ఆర్థిక కార్యకలాపాలు, ప్రభుత్వ సేవలపై ప్రభావం చూపేలా అక్టోబర్ నెల నుంచి పలు కీలక నిబంధనల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, బ్యాంకింగ్ లావాదేవీలు, జనన-మరణ ధ్రువీకరణ పత్రాల జారీ వరకు పలు అంశాల్లో నూతన విధానాలు అమల్లోకి రానున్నాయి.
ప్రధాన మార్పులు ఇవే:
బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్లు అందుతాయి. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారు సబ్సిడీని కోల్పోయే అవకాశం ఉంది. అక్టోబర్ 15వ తేదీ నుంచి నిర్దేశిత యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.
అక్టోబర్ 15వ తేదీ నుంచి నిర్దేశిత యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.
బ్యాంకులు తమ బల్క్ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను ప్రతిరోజూ ఉదయం 10:00 గంటల లోపు తప్పనిసరిగా వెల్లడించాలి. అలాగే ఒకే డిపాజిట్ కేటగిరీకి సంబంధించి కస్టమర్లను బట్టి వేర్వేరు వడ్డీ రేట్లను ఆఫర్ చేయడంపై నిషేధం ఉంటుంది.
జనన లేదా మరణ ధ్రువీకరణ పత్రాల కోసం నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత—ఏడాదికి మించి ఆలస్యంగా దరఖాస్తు చేసుకుంటే అదనపు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే సర్టిఫికెట్ జారీ అవుతుంది.
సామాన్య ప్రజలు, వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వీలైనంత త్వరగా అవసరమైన కేవైసీ, దరఖాస్తు ప్రక్రియలను పూర్తి చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


