మున్సిపల్ శాఖలో భారీ బదిలీలు.. GWMC కీలక అధికారుల మార్పులు:
రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖలో ప్రభుత్వం భారీ స్థాయిలో అధికారుల బదిలీలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 మంది అధికారులను వివిధ స్థానాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలన అవసరాలు సేవలు మెరుగుదల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ బదిలీలల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
ఈ బదిలీల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC)లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. GWMC అడిషనల్ కమిషనర్‌గా ఈ. జోనా (E. Jonah) నియమితులయ్యారు. అలాగే కార్పొరేషన్ సెక్రటరీగా పి. అనిల్ బాబు (P. Anil Babu) బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటివరకు సంబంధిత పదవుల్లో కొనసాగుతున్న చంద్రశేఖర్ ని ప్రభుత్వం మరో స్థానానికి బదిలీ చేసింది. తాజా బదిలీలతో GWMC పరిపాలనలో కొత్త అధికారిక బృందం బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో నగర అభివృద్ధి పనులు ప్రజాసేవ నిర్వహణలో మరింత వేగం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాష్ట్రంలోని వివిధ మునిసిపల్ సంస్థలు నగరపాలక సంస్థలు మరియు పట్టణ స్థానిక సంస్థల్లో పని చేస్తున్న అధికారులకు ఈ బదిలీలు వర్తిస్తాయి. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు అధికారులు తమ కొత్త బాధ్యతలను త్వరలోనే స్వీకరించనున్నారు. ఈ మార్పులు పట్టణ పరిపాలన వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు దోహదపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


