HomeWarangal Newsమామునూరు ఎయిర్‌పోర్ట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలి: కేంద్రానికి విజ్ఞప్తి

మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలి: కేంద్రానికి విజ్ఞప్తి

Published on

spot_img

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12:

వరంగల్ సమీపంలోని మామునూరు విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడును ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో కలిసి వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య కోరారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్లమెంట్‌లోని కేంద్ర మంత్రిగారి చాంబర్‌లో జరిగిన సమావేశంలో మామునూరు ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిపై సమగ్రంగా చర్చించారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయినందున వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

Proposed development site of Mamnoor Airport near Warangal
Mamnoor Airport

కార్గో, ఎంఓఆర్ సదుపాయాలు కూడా అవసరం

మామునూరు ఎయిర్‌పోర్ట్‌లో కార్గో సేవలతో పాటు మెయింటెనెన్స్‌, ఓవర్‌హాల్‌ రిపేర్ (ఎంఓఆర్‌) సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని కోరారు. వరంగల్ నగరం జౌళి సహా పలు పరిశ్రమలతో వేగంగా అభివృద్ధి చెందుతోందని, అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం అవసరం పెరిగిందని వివరించారు.

అలాగే, ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క-సారలమ్మ జాతర ప్రతి రెండేళ్లకోసారి మేడారంలో జరుగుతుందని, దేశ విదేశాల నుంచి భారీగా భక్తులు తరలివస్తారని పేర్కొన్నారు.

కేంద్రం హామీ

మామునూరు ఎయిర్‌పోర్ట్ పనుల ప్రారంభానికి అవసరమైన చర్యలపై పరిశీలన కోసం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను అక్కడికి పంపిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, డా. మల్లు రవి, సురేశ్ షెట్కార్, రామసహాయం రఘురాంరెడ్డి, గడ్డం వంశీకృష్ణతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Latest articles

ఐఫోన్‌లో కొత్త శకం.. ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది!

యాపిల్ ఎట్టకేలకు ఫోల్డబుల్ ఐఫోన్‌ను లాంచ్ చేసి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. కొత్త డిజైన్, ఫోల్డింగ్ డిస్‌ప్లే, అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ ఐఫోన్‌పై టెక్ ప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

నందు బిగ్ బాస్‌లోకి వస్తే..నాగార్జునకు కొత్త తలనొప్పి తప్పదా?

బిగ్ బాస్ తెలుగు 10లో నందు ఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నందు హౌస్‌లోకి వస్తే హోస్ట్ నాగార్జునకు కొత్త తలనొప్పులు తప్పవా? ఆమెకు సంబంధించిన వివాదాలు షోపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు: నేడు 22A నిషేధిత భూములపై చర్చ

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నాలుగో రోజు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో ప్రధానంగా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోని సెక్షన్ 22ఆ అంశంపై ఉభయ సభల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘమైన, వాడీవేడి చర్చ జరగనుంది.
spot_img

Related Articles

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఇసుక ట్రాక్టర్ – ఆటో ఢీ: ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పర్వతగిరి మండల పరిధిలోని అన్నారం గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక ఇసుక ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

హనుమకొండలో భారీ అగ్నిప్రమాదం: హోటల్ యజమాని దుర్మరణం, భార్య పరిస్థితి విషమం

హనుమకొండ జిల్లా పరిధిలోని అదాలత్ జంక్షన్ వద్ద ఉన్న ప్రముఖ 'లింగాల కేదారి హోటల్'లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.