వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం మామునూరు వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులను టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులను శ్రీపతి వంశీ, శ్రీపతి రాజుగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం మద్యం మత్తులో ఉన్న టాటా ఏస్ డ్రైవర్ వాహనం నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


