చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాకు పెంచిన టికెట్ రేట్లతో వచ్చిన రూ.42 కోట్లను రికవరీ చేయాలని హైకోర్టులో పిటిషన్.
రూ.42 కోట్ల వసూళ్లపై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, జీఎస్టీ అధికారులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు.
‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా ప్రత్యేక షోలకు టికెట్ ధర రూ.600 (జీఎస్టీతో కలిపి)గా నిర్ణయించారు.
వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.100 పెంచుతూ ఈ నెల 8న మెమో జారీ చేసిన హోంశాఖ ముఖ్య కార్యదర్శి.
కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ మెమో జారీ చేసి రూ.42 కోట్లు అక్రమంగా సంపాదించారని ఆరోపిస్తూ, ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది పాదూరి శ్రీనివాస రెడ్డి.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. రూ.42 కోట్ల వసూళ్లపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం, జీఎస్టీ అధికారులను ఆదేశించింది.
ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను వచ్చే నెల 3కి వాయిదా వేసింది.


