వరంగల్: జీతాల పెంపు, పెరిగిన పని ఒత్తిడిని తగ్గించాలనే ప్రధాన డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి పిలుపు వరంగల్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన కార్యక్రమానికి బయలుదేరుతున్న ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
వరంగల్ మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో 11 మంది మహిళా ఆశా వర్కర్లను ముందస్తు జాగ్రత్త చర్యగా అరెస్ట్ చేసినట్లు సీఐ కరుణాకర్ వెల్లడించారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా వారిని అడ్డుకుని స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరసన తెలిపేందుకు వెళ్తుంటే పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడంపై ఆశా వర్కర్ల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలు పెంచాలని, పని ఒత్తిడి తగ్గించాలని, ముందస్తుగా అరెస్ట్ చేసిన ఆశా వర్కర్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


