HomeLatest Newsఇవాళ మే 22..చరిత్రలో ఈ రోజుకి ఉన్న స్పెషాలిటి ఏంటో తెలుసా..?

ఇవాళ మే 22..చరిత్రలో ఈ రోజుకి ఉన్న స్పెషాలిటి ఏంటో తెలుసా..?

Published on

spot_img

ప్రతి సంవత్సరం మే 22న అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. భూమిపై ఉన్న జీవరాశుల వైవిధ్యాన్ని “జీవవైవిధ్యం”గా పేర్కొంటారు. ప్రకృతి సమతౌల్యాన్ని కాపాడటంలో జీవవైవిధ్యం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రాధాన్యతను గుర్తించిన ఐక్యరాజ్య సమితి 2010 సంవత్సరాన్ని అంతర్జాతీయ జీవవైవిధ్య సంవత్సరంగా ప్రకటించింది.

శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భూమిపై ఉన్న జీవరాశుల పరిణామ క్రమం సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. అయితే ఆధునిక జీవనశైలి, పరిశ్రమల విస్తరణ, అడవుల నరికివేత, కాలుష్యం పెరగడం వంటి కారణాలతో పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటోంది. ఫలితంగా భూగోళ ఉష్ణోగ్రతలు పెరిగి అనేక జీవజాతులు అంతరించిపోతున్నాయి.

ప్రపంచంలోని 12 ప్రధాన జీవవైవిధ్య ప్రాంతాల్లో భారత్ ఒకటి. దేశంలో సుమారు 45 వేల వృక్ష జాతులు, 77 వేలకుపైగా జంతు జాతులు ఉన్నాయి. అయితే వీటిలో అనేక జీవరాశులు ప్రస్తుతం అంతరించే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. గత కొన్ని దశాబ్దాల్లో అరణ్య విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోగా, నీటి వనరులు కూడా వేగంగా కనుమరుగవుతున్నాయి.

ఇటీవల జన్యుమార్పిడి పద్ధతులు, వాతావరణ మార్పులు కూడా జీవవైవిధ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేలాది జీవజాతులు అంతరించిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవవైవిధ్యం క్షీణిస్తే మానవ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రకృతిని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత. మొక్కలు నాటడం, అడవులను సంరక్షించడం, నీటి వనరులను కాపాడడం ద్వారా జీవవైవిధ్య పరిరక్షణకు అందరూ సహకరించాల్సిన అవసరం ఉంది.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.