మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా హుండీల లెక్కింపు నాలుగో రోజుకు చేరుకుంది. ఈ రోజు నిర్వహించిన లెక్కింపులో మొత్తం 200 హుండీలను తెరిచి పరిశీలించగా, భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 2,64,75,757 ఆదాయం లభించింది.
ఇప్పటి వరకు నాలుగు రోజుల పాటు కొనసాగిన హుండీ లెక్కింపులో మొత్తం 625 హుండీలను లెక్కించగా, వాటి ద్వారా రూ. 10,71,22,116 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.


