మేడారం మహా జాతర మొదలైతే సాధారణంగా వీఐపీలు, రాజకీయ నాయకులు, ప్రముఖుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈసారి ములుగు జిల్లా కలెక్టర్ చాలా కఠినంగా నిర్ణయం తీసుకున్నారు. వీఐపీ పాసుల సంఖ్యను గణనీయంగా తగ్గించారు.
గత జాతరల్లో సుమారు 50 వేల పాసులు జారీ చేసేవారు. కానీ ఈసారి 15 వేల కంటే తక్కువ పాసులకే పరిమితం చేశారు. ఒక్కో ఎమ్మెల్యేకు కేవలం 5 నుంచి 10 VIP/వీవీఐపీ పాసులు మాత్రమే ఇవ్వాలని నిబంధనలు విధించారు.
పాసుల సంఖ్య పెంచాలని ఎవరైనా అడిగితే – ఏమాత్రం ఇవ్వబోమని కలెక్టర్ స్పష్టంగా తేల్చిచెప్పారు. దీంతో ఈసారి పాసుల కోసం గోల, ఒత్తిడి గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది.
ఇది జాతరలో క్రమశిక్షణ, భక్తుల సౌకర్యం, ట్రాఫిక్ నియంత్రణ కోసం తీసుకున్న మంచి నిర్ణయంగా అధికారులు భావిస్తున్నారు. ఈ జాతర (జనవరి 28 నుంచి 31 వరకు) సాఫీగా, సమస్యలు లేకుండా జరగాలనేదే లక్ష్యం! 🚩


