ములుగు జిల్లా మేడారం లో జరుగుతున్న 2026 సమ్మక్క–సారలమ్మ రాష్ట్ర జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు మూడో రోజు కొనసాగింది. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో లెక్కింపు ప్రక్రియను అధికారులు నిర్వహించారు.
ఫిబ్రవరి 7, 2026న మూడో రోజుగా కొనసాగిన హుండీల లెక్కింపులో మొత్తం 140 హుండీలు ఓపెన్ చేయగా ₹2,01,21,440 నగదు లభించింది. అదే రోజు విదేశీ కరెన్సీ మార్పిడి ద్వారా ₹71,283 వచ్చిందని అధికారులు తెలిపారు.
మూడు రోజుల లెక్కింపు వివరాలు:
- ఫిబ్రవరి 5: 125 హుండీలు – ₹2,49,65,000
- ఫిబ్రవరి 6: 160 హుండీలు – ₹3,54,25,200
- ఫిబ్రవరి 7 (మూడో రోజు): 140 హుండీలు – ₹2,01,21,440
👉 మూడు రోజుల్లో మొత్తం 425 హుండీలు ఓపెన్ చేసి ₹8,06,46,359 ఆదాయం నమోదైంది.
మొత్తం హుండీల వివరాలు:
- ఇనుప హుండీలు – 780
- బట్ట హుండీలు – 45
- బియ్యం హుండీలు – 3
- మొత్తం – 828 హుండీలు
హుండీల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నాణేల లెక్కింపు ప్రారంభం కాలేదని, మూడో రోజున లభించిన ₹2,01,92,723 నగదును బ్యాంక్ అధికారులకు అప్పగించినట్లు వెల్లడించారు. మిగిలిన హుండీల లెక్కింపు కొనసాగనుందని చెప్పారు.
ఈ వివరాలను తెలంగాణ ఎండోమెంట్ శాఖ కమిషనర్‌కు అధికారికంగా నివేదించినట్లు జాతర ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలిపారు.


