HomeWarangal Newsమహిళా సంఘాలకు సౌరశక్తితో ఆదాయం.. అశ్వరావుపల్లిలో మెగా సోలార్ ప్లాంట్‌కు శ్రీకారం

మహిళా సంఘాలకు సౌరశక్తితో ఆదాయం.. అశ్వరావుపల్లిలో మెగా సోలార్ ప్లాంట్‌కు శ్రీకారం

Published on

spot_img

మహిళా సంఘాలకు సౌరశక్తితో ఆదాయం.. అశ్వరావుపల్లిలో మెగా సోలార్ ప్లాంట్‌కు శ్రీకారం :

మహిళలను ఆర్థికంగా పారిశ్రామికంగా బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఉపముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఆశ్వర రావుపల్లి గ్రామంలో జిల్లా మహిళా సమాఖ్య, మండల మహిళా సమఖ్యల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ కు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ తో కలిసి శంకుస్థాపన చేశారు.

సుమారు రెండు కోట్ల 90 లక్షల వ్యయంతో నిర్మించునున్న ఈ సోలార్ ప్లాంట్ ద్వారా మహిళా సంఘాలకు దీర్ఘకాలిక ఆదాయం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రాజెక్టు 20 సంవత్సరాల పాటు పని చేసే సామర్థ్యం కలిగి ఉండగా.. జిల్లా మరియు మండల మహిళా సమఖ్యలకు నెలకు సుమారు నాలుగు లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు.. ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు వంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మహిళలను స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్తుందని పేర్కొన్నారు. మహిళల పేరుతో రేషన్ కార్డులు , ఇందిరమ్మ ఇల్లు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా జనగామ జిల్లాలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్రామపంచాయతీల స్థాయిలో విత్తనాలు ఎరువుల దుకాణాలు ఏర్పాటు చేసే వినూత్న కార్యక్రమానికి త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

Latest articles

AI 80’s ఫోటో ట్రెండ్‌పై నిపుణుల హెచ్చరిక.. ఫోటోలు అప్‌లోడ్ చేసే ముందు జాగ్రత్త!

AI టూల్స్‌తో 1980ల నాటి ఫోటోల తరహాలో చిత్రాలను మార్చుకునే ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వ్యక్తిగత ఫోటోలను AI ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేసే ముందు ప్రైవసీ, డేటా భద్రతపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బిగ్ బాస్ హోస్టుల రెమ్యునరేషన్.. ఒక్కో సీజన్‌కు కోట్లలో పారితోషికం!

బిగ్ బాస్ షోకు హోస్టులుగా వ్యవహరించిన ప్రముఖ నటులు, సెలబ్రిటీలకు భారీగా పారితోషికం అందినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో సీజన్‌కు ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసుకోవాలంటే ఈ వివరాలు చూడాల్సిందే.

అభిమానం అంటే ఇదే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన పనికి ప్రశంసలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) సామాజిక బాధ్యతలో భాగంగా కీలక కార్యక్రమం చేపట్టింది. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై దేశవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది బాలికలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

నిద్రలో పదేపదే మేల్కొంటున్నారా? మీ శరీరం చెప్తుందే ఇదే..!

రాత్రిపూట నిద్రలో పదేపదే మెలకువ రావడానికి ఒత్తిడి, ఆందోళన, కెఫిన్, గది వాతావరణం వంటి కారణాలు ఉండొచ్చు. అయితే గురకతో పాటు శ్వాస ఆగడం, పగటిపూట అధిక నిద్రమత్తు ఉంటే స్లీప్ అప్నియా సంకేతాలు కావచ్చు.
spot_img

Related Articles

వరంగల్‌లో మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం

మాజీ మంత్రి కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ తండ్రి సుబ్రహ్మణ్యం శుక్రవారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ చొరవతో ప్రమాదకర గుంతల పూడ్చివేత..

నగర పరిధిలోని ఫాతిమా బ్రిడ్జి, అదాలత్ సెంటర్ ప్రధాన రహదారులపై వాహనదారులకు నరకం చూపుతున్న ప్రమాదకర గుంతలను ట్రాఫిక్ సీఐ వెంకన్న తన సొంత చొరవతో పూడ్చివేయించారు.

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో సడన్‌గా చెలరేగిన మంటలు: సకాలంలో స్పందించి పెను ప్రమాదాన్ని తప్పించిన డెలివరీ బాయ్స్

విద్యుత్‌నగర్‌లోని రోడ్‌ నంబర్‌ 1 సమీపంలో ఒక భారీ ప్రమాదం తృప్తిలో తప్పింది. గురువారం రోజున అక్కడ ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.