టెక్నాలజీ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. మనుషులు చేసే అనేక పనులను యంత్రాలు సులభంగా పూర్తి చేస్తున్నాయి. దీంతో ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాలపై ప్రభావం పడుతుందనే చర్చ కూడా పెరుగుతోంది. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా షేర్ చేసిన ఓ AI-generated వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో మహిళల చేతులకు మెహందీ వేసే ప్రత్యేకమైన మెషీన్ కనిపించింది.
చేతిపై అందమైన డిజైన్ :
వైరల్ వీడియోలో ఓ మహిళ తన చేతిని మెషీన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్థానం వద్ద ఉంచుతుంది. ఆ తర్వాత యంత్రం ఆమె చేతిపై అందమైన మెహందీ డిజైన్‌ను రూపొందిస్తుంది. సాధారణంగా మెహందీ కళాకారులు ఎంతో నైపుణ్యంతో చేసే పనిని యంత్రం చేయడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ప్రక్రియలో మనుషుల ప్రమేయం చాలా తక్కువగా కనిపిస్తుంది.
‘Some more jobs gone’ అంటూ హర్ష్ గోయెంకా :
ఈ వీడియోను హర్ష్ గోయెంకా తన X ఖాతాలో షేర్ చేస్తూ ‘Some more jobs gone’ అనే క్యాప్షన్ పెట్టారు. దీంతో భవిష్యత్తులో ఆటోమేషన్ వల్ల సంప్రదాయ వృత్తులపై ఎలాంటి ప్రభావం పడుతుందనే చర్చ మొదలైంది.
మెహందీ కళాకారులపై ప్రభావం ఉంటుందా? :
పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల సమయంలో మెహందీ కళాకారులకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇది కేవలం ఉపాధి మాత్రమే కాకుండా ఒక కళ కూడా. యంత్రాలు వేగంగా, ఒకే విధమైన ఖచ్చితత్వంతో డిజైన్లు వేయగలిగినా.. కస్టమర్ అభిరుచికి అనుగుణంగా డిజైన్‌ను మార్చడం, చేతి ఆకృతికి తగ్గట్టు మెహందీ వేయడం వంటి విషయాల్లో మనుషుల నైపుణ్యానికి ప్రత్యేకత ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు కూడా భిన్నంగా స్పందిస్తున్నారు.
Some more jobs gone 🙈 https://t.co/jKiUzB8gOA— Harsh Goenka (@hvgoenka) September 9, 2026


