HomeWarangal Newsఎంజీఎం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై మంత్రి కొండా సురేఖకు వినతి..!

ఎంజీఎం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై మంత్రి కొండా సురేఖకు వినతి..!

Published on

spot_img

ఎంజీఎం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై మంత్రి కొండా సురేఖకు వినతి..!

వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ, పేషంట్ కేర్ సేవలతో పాటు ఇతర కాంట్రాక్ట్ కార్మికులు తమ ఉద్యోగాలకు సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కార్మికులు తమకు అందుతున్న వేతనాలు ప్రస్తుత జీవన వ్యయాలకు అనుగుణంగా లేవని వెంటనే జీతాలను పెంచాలని కోరారు .

అలాగే ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నామని తెలిపారు. తమ కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉద్యోగ భద్రత కల్పించే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కార్మికుల సమస్యలను మంత్రి కొండా సురేఖకు వివరించి సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు చేపట్టేలా చూడాలని వినతిపత్రం సమర్పించారు. కార్మికుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి న్యాయం చేయాలని వారు కోరారు. ఎంజీఎం ఆసుపత్రిలో కీలక సేవలు అందిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా కార్మికుల విజ్ఞప్తి చేశారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.
spot_img

Related Articles

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...