వరంగల్ ఎంజీఎం (MGM) ఆసుపత్రిలో సబ్‌స్టాన్స్ అబ్యూస్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (Substance Abuse Intensive Care Unit – SAICU) ఏర్పాటు పూర్తయ్యింది. ఈ యూనిట్‌ను శనివారం జిల్లా కలెక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించనున్నారు.
‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా దీనిని ఏర్పాటు చేశారు. డీ-అడిక్షన్ సెంటర్లలో కౌన్సెలింగ్ పొందిన తర్వాత, తదుపరి వైద్య చికిత్స అవసరమైన రోగులను ఈ యూనిట్లో చేర్చి మెరుగైన వైద్యం అందిస్తారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ చంద్రారెడ్డి వెల్లడించారు.


