వరంగల్ జిల్లా : మిల్స్ కాలనీ పరిధిలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు.
చట్ట విరుద్ధంగా నిల్వ చేసి విక్రయాలకు సిద్ధం చేసిన రెండు లక్షల రూపాయలకు పైగా విలువైన మద్యాన్ని మిల్స్ కాలనీ పోలీసులు జేసీబీ సహాయంతో పూర్తిగా ధ్వంసం చేశారు.

ప్రజల ఆరోగ్యం మరియు సమాజ శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మిల్స్ కాలనీ సీఐ బొల్లం రమేష్.. అక్రమ మద్యం వ్యాపారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.
ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తూ అక్రమంగా మద్యం అమ్మకాలు నిర్వహించినట్లయితే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజలు కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండి పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.
సమాజంలో శాంతి భద్రతలు కాపాడటం కోసం పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తుందని అధికారులు వెల్లడించారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


