స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం
తేదీ: 17.01.2026
ముమ్మరంగా కొనసాగుతున్న మినీ సమ్మక్క సారలమ్మ జాతరల ఏర్పాట్లు
నియోజకవర్గ పరిధిలోని 6 జాతరలలో హైమాస్ లైట్లు మంజూరు చేసిన ఎంపీ డా. కడియం కావ్య
జాతరలోపు పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు
ఈ నెల 10వ తేదీన స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని మినీ సమ్మక్క సారలమ్మ జాతరల ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో జాతర ప్రాంతాలలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు, జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా గారు అధికారులతో, జాతర కమిటీ సభ్యులతో, సర్పంచులతో చర్చించారు.
జాతర ప్రాంతాలలో ఫార్మేషన్ రోడ్లు, విద్యుత్, త్రాగు నీరు, పారిశుధ్యం వంటి పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.
ఈ సమీక్షలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు స్టేషన్ ఘనపూర్ మండలంలోని జిట్టేగూడెం, ఇప్పగూడెం మరియు చిల్పూర్ మండలం లోని గార్లగడ్డ తండ, లింగంపల్లి, శ్రీపతిపల్లి, చిల్పూర్ మినీ సమ్మక్క సారలమ్మ జాతరలలో ఎంపీ నిధుల ద్వారా హైమాస్ లైట్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
ఇచ్చిన హామీ మేరకు 6జాతరలలో 9లక్షల రూపాయలతో 6హైమాస్ లైట్లను మంజూరు చేయించారు. ఈ హైమాస్ లైట్లను జాతర లోపు ఏర్పాటు చేయాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు సంబంధిత అధికారులను, జాతర కమిటీలను ఆదేశించారు.
25వ తేదీలోపు అన్ని పనులు పూర్తి చేయాలని, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.


