ములుగు జిల్లా ఇంచర్లలో నిర్వహించిన “అలైవ్ – అరైవ్” కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వాహనదారులకు పలు కీలక సూచనలు చేశారు.
వాహన డ్రైవర్లు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, అలాగే రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. చాలా మంది త్వరగా చేరుకోవాలనే తొందరలో అతివేగంగా ప్రయాణించి ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణాల్లో ఎప్పుడూ నిర్ణీత వేగాన్ని పాటించాలని, ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమాన్ని ములుగు జిల్లా పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఆదివారం నాడు నిర్వహించారు.


