HomeLatest Newsములుగుకు త్వరలో రింగ్ రోడ్డు: మంత్రి సీతక్క కీలక ప్రకటన

ములుగుకు త్వరలో రింగ్ రోడ్డు: మంత్రి సీతక్క కీలక ప్రకటన

Published on

spot_img

హనుమకొండ: ములుగు పట్టణ ప్రజలకు త్వరలోనే లారీల రద్దీ, ట్రాఫిక్ కష్టాల నుండి విముక్తి కలగనుంది. పట్టణంలో లారీల రాకపోకల వల్ల స్థానికులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు వీలుగా రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు రాష్ట్ర మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆమె పేర్కొన్నారు.

​రింగ్ రోడ్డుకు సంబంధించి ప్రస్తుతం ప్రాథమిక రూట్‌ను పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. యూనివర్సిటీ పక్క నుంచి మొదలై.. మదన్‌పల్లి మీదుగా కాసిందేవిపేట, దేవగిరిపట్నం వైపు వెళ్లే మార్గాన్ని పరిశీలనలో ఉంచినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “రైతుల భూములకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, అదే సమయంలో పట్టణానికి వీలైనంత సమీపంలోనే ఈ రింగ్ రోడ్డు ఉండేలా పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నాం” అని స్పష్టం చేశారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.