HomePoliticsకేటీఆర్ అహంకారానికి 'దొర ధోరణే' కారణం: మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం

కేటీఆర్ అహంకారానికి ‘దొర ధోరణే’ కారణం: మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం

Published on

spot_img

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఖరిపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నిప్పులు చెరిగారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి, దొర ధోరణికి పరాకాష్ట అని ఆమె మండిపడ్డారు.

క్షమాపణ చెప్పాల్సిందే..

రాజకీయాల్లో విమర్శలు సహజమని, కానీ వ్యక్తిగత దూషణలకు దిగడం కేటీఆర్ సంస్కారహీనతకు నిదర్శనమని సీతక్క ధ్వజమెత్తారు. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేటీఆర్ తక్షణమే రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఫామ్‌హౌస్ సంస్కృతిని, ఫారిన్ టూర్ల అలవాటును వీడి ఇప్పటికైనా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని హితవు పలికారు.

రైతుల విషయంలో విఫలమయ్యారు

బీఆర్ఎస్ హయాంలో రైతు రుణమాఫీ పేరుతో రైతులను వంచించారని సీతక్క విమర్శించారు. నాలుగు విడతల పేరుతో వడ్డీల భారం మోపిన చరిత్ర బీఆర్ఎస్‌ది అని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 9 రోజుల్లోనే ₹9,000 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేసి తన నిబద్ధతను చాటుకుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఇవ్వని పంట బోనస్‌ను తాము అందిస్తున్నామని ఆమె గుర్తుచేశారు.

కమిషన్ల ఆరోపణలపై ఎద్దేవా

కమిషన్ల గురించి మాట్లాడే హక్కు కేటీఆర్‌కు లేదని, గతంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ చేసిన ఆరోపణలే ఆయన అవినీతికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. చనిపోయిన రైతు కుటుంబాలను గత ప్రభుత్వం కోర్టుల చుట్టూ తిప్పిందని, తమ ప్రభుత్వం మానవత్వంతో ఆ కుటుంబాలను ఆదుకుంటోందని చెప్పారు. సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కేటీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలు బుద్ధి చెప్పినా మారలేదు

ప్రజలు ఇప్పటికే రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను పాతరేశారని, ఇప్పటికైనా కేటీఆర్ తన తీరు మార్చుకోకపోతే మరింత నష్టపోతారని హెచ్చరించారు. అహంకారాన్ని వీడి ప్రజల పక్షాన నిలబడాలని సీతక్క సూచించారు.

Latest articles

బేకరీలో ఇదేం నిర్వాకం? సోదాల్లో బయటపడ్డ షాకింగ్ దృశ్యాలు!

ఉప్పల్‌లోని SLV బెంగళూరు అయ్యంగార్ బేకరీలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై SOT, M-FAST అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భరత్‌నగర్ కాలనీలో జరిగిన ఈ సోదాల్లో అధికారులు పలు అంశాలను పరిశీలించారు.

SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు భారీ ఊరట.. ఏజ్ లిమిట్ పెంపు!

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎస్సై, కానిస్టేబుల్‌తో పాటు తత్సమాన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని మరో మూడేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను ఎంత దూరంలో పెట్టాలి? నిపుణుల సూచనలు !

నిద్రపోయే సమయంలో ఫోన్‌ను బెడ్‌కు దూరంగా పెట్టడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడటంతో పాటు స్క్రీన్ టైమ్ తగ్గుతుంది. ఫోన్‌ను దూరంగా ఉంచడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి

హనుమకొండలో భారీ అగ్నిప్రమాదం: హోటల్ యజమాని దుర్మరణం, భార్య పరిస్థితి విషమం

హనుమకొండ జిల్లా పరిధిలోని అదాలత్ జంక్షన్ వద్ద ఉన్న ప్రముఖ 'లింగాల కేదారి హోటల్'లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
spot_img

Related Articles

కాంగ్రెస్, BRSలపై ఫైర్ అయిన బీజేపీ నేత రామచందర్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్, BRS పార్టీలు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి, వీధి నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, వారి వైఖరిని చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.

కొండా సురేఖను బీఆర్‌ఎస్‌లోకి రానివ్వం: జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖను బీఆర్‌ఎస్ పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వబోమని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కొండా దంపతులకు జనసేనలో నో ఎంట్రీ? సుస్మితకు మాత్రమే గ్రీన్ సిగ్నల్

మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీలను జనసేన పార్టీలోకి తీసుకోవద్దనే ఆలోచనలో జనసేనాని ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితకు మాత్రమే పార్టీలోకి ఆహ్వానం పలికే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.