మహబూబాబాద్ కలెక్టరేట్‌లో నూతనంగా నిర్మించిన వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు.
వృద్ధుల పోషణ మరియు సంరక్షణలో ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. వృద్ధులు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని, వృద్ధుల వైద్యం మరియు ఇతర అవసరాల పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.


