తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 22న సిద్దిపేటలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించడంతో పాటు, రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు.
ఈ ప్రభుత్వ కార్యక్రమానికి రావాల్సిందిగా బీఆర్‌ఎస్ నేతలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా ఆహ్వానించారు. అసెంబ్లీలోని ఎల్‌ఓపి (LoP) ఛాంబర్‌కు వెళ్లిన మంత్రి.. కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితరులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ సందర్భంగా నేతలందరూ కాసేపు సరదాగా ముచ్చటించారు.


