HomeWarangal Newsడ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యం: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యం: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

Published on

spot_img

హనుమకొండ: డ్రగ్స్ రహిత తెలంగాణ కార్యక్రమం హనుమకొండ కలెక్టరేట్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. యువతను పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారిని అంతమొందించి, “డ్రగ్స్ రహిత తెలంగాణ”ను సాధించడమే లక్ష్యంగా హనుమకొండ కలెక్టరేట్‌లో గురువారం ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారితో కలిసి రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా గారు, రాష్ట్ర మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

​పోస్టర్ ఆవిష్కరణ:

​డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థుల్లో చైతన్యం తెచ్చేందుకు రూపొందించిన ప్రత్యేక పోస్టర్‌ను గవర్నర్, మంత్రి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్పాయి, సత్య శారదా దేవి గారు మరియు ఇతర ఎమ్మెల్యేలతో కలిసి సంయుక్తంగా ఆవిష్కరించారు.

​”నషా ముక్త్ భారత్” ప్రతిజ్ఞ:

​పోస్టర్ ఆవిష్కరణ అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో హాజరైన విద్యార్థులు, యువత, ప్రభుత్వ అధికారులు, ప్రజలతో కలిసి నాయకులంతా “నషా ముక్త్ భారత్” (వ్యసన ముక్త భారత్) ప్రతిజ్ఞ చేశారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, సమాజాన్ని కాపాడుకుంటామని ఈ సందర్భంగా అందరూ శపథం చేశారు.

​సంతకాల సేకరణ:

​డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే పిలుపుతో చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు పాల్గొని తన సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత డ్రగ్స్ బారిన పడకుండా విద్యార్థి దశ నుంచే అవగాహన పెంచుకోవాలని, ఉజ్వల భవిష్యత్తును పాడుచేసుకోవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

యువత భవిష్యత్తును రక్షించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పిలుపునిస్తూ, డ్రగ్స్ రహిత తెలంగాణ కార్యక్రమంను ప్రజా ఉద్యమంగా మార్చాలని కోరారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles