HomeWarangal Newsకల్పలత సూపర్ బజార్‌లో అవకతవకలు – ఎమ్మెల్యే నాయిని

కల్పలత సూపర్ బజార్‌లో అవకతవకలు – ఎమ్మెల్యే నాయిని

Published on

spot_img

ది కో ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ కల్పలత సూపర్ బజార్ ఆకస్మిక తనికి చేసిన ఎమ్మెల్యే నాయిని..

భారీ స్థాయిలో జరిగిన కుంభకోణం, అక్రమాల పై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే..

బినామీల పేర్లతో జీతాలు, సొంత వాహనాలు డీజిల్, సభ్యత్వ నమోదులో అవకతవకలు పట్ల మండిపడ్డ ఎమ్మెల్యే నాయిని..

జిల్లా అధికార యంత్రంగా వెంటనే సంబధిత పత్రాలను పరిశీలన చేసి, సీజ్ చేయాలని కోరిన ఎమ్మెల్యే..

సత్వరమే కమిటీ రద్దు చేసి, విచారణ చేపట్టాలని కలెక్టర్, RDO లకు సూచించిన ఎమ్మెల్యే..

MLA Naini Rajender Reddy

హనుమకొండ జిల్లా ది కో ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ కల్పలత సూపర్ బజార్ కార్యాలయాన్ని మంగళవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొదటగా ఎమ్మెల్యే గారు వెళ్లిన వెంటనే కార్యాలయంలో సిబ్బంది లేకపోవడం వల్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రిజిష్టర్ లో 7 గురు సిబ్బంది ఉన్నప్పటికీ కేవలం ముగ్గురు మాత్రమే హాజరవడం అందులో ఇద్దరు మాత్రమే విధులలో ఉండటం పై ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే రికార్డులు, రిజిస్టర్, జమ, ఖర్చు తాలూకా రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఎమ్మెల్యే గారు తనికీలలో ప్రధానంగా దృష్టికి వచ్చిన అంశాలు :

  • గతపాలకుల చేతిలో ఇంకా కీలు బొమ్మల్లా వ్యవహరిస్తూ సభ్యత్వ నమోదులో ఆర్దికపరమైన అవకతవకలు జరిగాయని తనికీలలో స్పష్టంగా కనిపించాయి.
  • సభ్యత్వ నమోదుకు చెల్లించిన రుసుము మొత్తాన్ని పక్కదారిలో ఉపయోగించి వాటికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు.
  • కల్పలత సూపర్ బజార్ పాలకమండలి సభ్యులు తమ స్వప్రయోజనాలకు డీజిల్,పెట్రోల్ గడిచిన 3 ఏళ్లుగా వాడుకున్నారని వాటికి ఎటువంటి అనుమతులు లేవని,డీజిల్ డబ్బులు కూడా చెల్లాయించలేదని దృష్టికి వచ్చాయి.
  • కో ఆపరేటివ్ ఆదినంలో నడుస్తున్న పెట్రోల్ బంక్ లో 10 మంది సిబ్బంది పేరుతో నెలకు 10000/- ల చొప్పున జీతాలను తీసుకుంటున్నారు.
  • జీతాలు తీసుకుంటున్న వారి వివరాలు రిజిస్టర్ లో ఉన్నప్పటికీ వారి సంతకాలు లేవు. తనికీలా అనంతరం రిజిస్టర్ లను వెంటనే జప్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ ద్వారా వివరించారు. RDO గారు కార్యాలయం చేరుకుని పరిశీలించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చాలా రోజులుగా కల్పలత సూపర్ బజార్ లో అవకతవకలు జరిగాయని నా దృష్టికి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతి రంగంలో అవినీతి జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఇక్కడ జరిగిన కుంభకోణంపై వెంటనే విచారణ చేపట్టాలని సంబధిత అధికారులకు కోరడం జరిగిందని అన్నారు.

సొసైటీలో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని, తప్పు చేసిన వారిని వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారు ఆదేశించారు.

Latest articles

బ్రేక్‌ఫాస్ట్‌ లో ఈ ఫుడ్స్ తింటే కడుపు నిండుగా.. ఆరోగ్యం పదిలం!

ఉదయం అల్పాహారం రోజంతా శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండే సమతుల్యమైన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఎక్కువసేపు ఎనర్జీగా ఉండొచ్చు.

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి
spot_img

Related Articles

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...