HomeWarangal Newsహనుమకొండలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్

హనుమకొండలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్

Published on

spot_img

 హనుమకొండ: జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా హనుమకొండ జిల్లాలో చిన్నారులకు పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్ పాయ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

"చిన్నారుల కోసం భారీ ఆరోగ్య కార్యక్రమం: హనుమకొండలో పల్స్ పోలియో ప్రారంభం"

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. చిన్నారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

హనుమకొండ జిల్లాలో సుమారు 9,90,334 మంది జనాభా ఉండగా, అందులో ఐదు సంవత్సరాల లోపు చిన్నారులు 84,301 మంది ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. వీరిలో పట్టణ ప్రాంతాల్లోనే 33,313 మంది చిన్నారులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ చిన్నారులందరికీ పోలియో చుక్కలు అందించేందుకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా 460 పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

సమీపంలోని పోలియో బూత్‌లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లలో నిర్వహిస్తున్న ఈ పోలియో కార్యక్రమాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. రామ్‌కుమార్, డెవలప్మెంట్ కమిటీ మెంబర్ ఈ.వి. శ్రీనివాస్ రావు, ఆసుపత్రి సూపరెండెంట్ నిర్మల, పలువురు వైద్య సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రశ్న: హనుమకొండ పల్స్ పోలియో కార్యక్రమం ఎవరు ప్రారంభించారు?
జవాబు: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రశ్న: ఈ కార్యక్రమం లక్ష్యం ఏమిటి?
జవాబు: ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం ద్వారా పోలియో నిర్మూలన.

FAQ’s

1. హనుమకొండ పల్స్ పోలియో కార్యక్రమం ఎక్కడ జరుగుతోంది?

జిల్లా వ్యాప్తంగా పోలియో బూత్‌లు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల్లో జరుగుతోంది.

2. ఎవరికి పోలియో చుక్కలు వేస్తారు?

ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు వేస్తారు.

3. జిల్లాలో ఎన్ని పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు?

సుమారు 460 కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles