HomeWarangal Newsబాధిత కుటుంబానికి అండగా ఎమ్మెల్యే నాయిని.. రూ. 5 లక్షల బీమా చెక్కు అందజేత

బాధిత కుటుంబానికి అండగా ఎమ్మెల్యే నాయిని.. రూ. 5 లక్షల బీమా చెక్కు అందజేత

Published on

spot_img

హన్మకొండ: విద్యుత్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఓ నిరుపేద కుటుంబానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి భరోసా ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్ రామన్నపేటకు చెందిన జన్ను మల్లయ్య గత కొన్ని నెలల క్రితం జరిగిన విద్యుత్ ప్రమాదంలో మృతి చెందారు.

విద్యుత్ శాఖ ద్వారా మంజూరైన రూ. 5 లక్షల ప్రమాద బీమా చెక్కును ఎమ్మెల్యే నాయిని స్వయంగా బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, బాధిత కుటుంబం ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డీఈ సాంబ రెడ్డితో పాటు ఇతర స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

​అనుకోని ప్రమాదంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న తమ కుటుంబానికి ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే చేసిన ఈ ఆర్థిక సాయం ఎంతో ఊరటనిస్తుందని బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles