HomeWarangal Newsరోడ్ల నిర్మాణంలో టైం బాండ్.. అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదు: ఎమ్మెల్యే నాయిని

రోడ్ల నిర్మాణంలో టైం బాండ్.. అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదు: ఎమ్మెల్యే నాయిని

Published on

spot_img

హనుమకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లోనూ అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి, నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తున్నామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం 5వ డివిజన్ పరిధిలోని రెడ్డి కాలనీలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్డు పనులకు ఆయన కొబ్బరికాయ కొట్టి ఘనంగా శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… నియోజకవర్గంలో ప్రతిరోజూ రెండు డివిజన్లలో రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేస్తున్నామని, ప్రారంభించిన ప్రతి పనికీ కాంట్రాక్టర్లు, అధికారులకు స్పష్టమైన ‘టైం బాండ్’ విధిస్తున్నామని తెలిపారు. నిర్ణీత గడువులోగా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ఆదేశిస్తూ నిరంతరం పురోగతిని సమీక్షిస్తున్నామన్నారు. పార్టీలు, వర్గాల తారతమ్యం లేకుండా అన్ని ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఇప్పటివరకు ప్రారంభించిన రోడ్లలో దాదాపు 80 నుంచి 85 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు.

అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కోసమే తాత్కాలిక విరామం

మిగిలిన కొన్ని రోడ్ల పనులకు తాత్కాలికంగా విరామం ఇవ్వడానికి గల కారణాన్ని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సహకారంతో వరంగల్ నగరానికి భారీ స్థాయిలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు మంజూరైందని, ప్రస్తుతం టెండర్ ప్రక్రియ తుది దశకు చేరిందని తెలిపారు. ఇప్పుడు కొత్త రోడ్లు నిర్మించి, మళ్లీ డ్రైనేజీ, తాగునీటి పైప్‌లైన్ల కోసం వాటిని తవ్వడం ప్రజాధనం వృధా చేయడమే అవుతుందని పేర్కొన్నారు. ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని, రాబోయే రెండు మూడు నెలల వ్యవధిని ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు.

చేస్తున్న పనులే విమర్శకులకు సమాధానం

పనిలేని, పసలేని ప్రతిపక్ష నాయకుల మాటలను నమ్మే పరిస్థితిలో పశ్చిమ నియోజకవర్గ ప్రజలు లేరని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. విమర్శలు చేసేవారు క్షేత్రస్థాయికి వెళ్లి పనుల నాణ్యతను, పురోగతిని పరిశీలించాలని హితవు పలికారు. ప్రజల మధ్య జరుగుతున్న అభివృద్ధే తమ పనితీరుకు నిదర్శనమని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు మరియు రెడ్డి కాలనీ నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles