వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బుధవారం హన్మకొండలోని 52వ డివిజన్ హస్తినాపురి కాలనీలో పర్యటించారు.
దాదాపు ₹69 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి డివిజన్ను అభివృద్ధి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. గత పాలకులు నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని, అందుకే ఇప్పుడు యుద్ధప్రతిపాదికన పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.


