గ్రేటర్ వరంగల్ పరిధిలోని 31, 51వ డివిజన్లలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బుధవారం పర్యటించారు.
సుమారు రూ.కోటి అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన ఘనంగా శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, పనులు నాణ్యతతో, సకాలంలో పూర్తి కావడానికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, అధికారులు మరియు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.


