హన్మకొండ: 20/01/2026 వరంగల్ పశ్చిమ నియోజకవర్గం.
అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో సమిష్టి అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు అన్నారు.
మంగళవారం (20-01-2026) వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 58వ డివిజన్ ఎన్జీవోస్ కాలనీలో చేపట్టనున్న పైపులైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాయిని శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించడమే లక్ష్యంగా మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు.
ప్రతి డివిజన్‌లో ప్రజల అవసరాలను గుర్తించి, సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.


